
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వానము
॥ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ॥
శ్రీ కోదండ రామాలయ దేవస్థానం సంఘం
(రిజిస్టర్డ్ నెం. 188/2014)
పడవల రేవు, గుణదల, విజయవాడ.
॥ ధ్యాన శ్లోకములు ॥
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం |
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ||
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం |
రామం నిశాచర వినాశకరం నమామి ||
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||


భక్తకోటికి విన్నపం... స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, అనగా ది. 27-03-2026, శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా, మన పడవల రేవు నందలి శ్రీ కోదండ రామాలయం లో జరుపబడు కార్యక్రమ వివరములు.
కార్యక్రమ వివరములు:
27-03-2026 (శుక్రవారం)మధ్యాహ్నం 12:00 గం॥లకుశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము
ముఖ్య గమనిక: కావున యావన్మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమములలో పాల్గొని, తీర్థ ప్రసాదములు స్వీకరించి, ఆ సీతారాముల కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్థన.
శ్రీ కోదండ రామాలయం మరియు శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానములు,
పడవల రేవు, గుణదల, విజయవాడ.
ఇట్లు, నిర్వహణ కమిటీ మరియు అర్చక స్వాములు









